Page Loader
volcano:ఇండోనేషియాలో బద్దలైన మౌంట్ లాకీ-లాకీ అగ్నిపర్వతం; 9 మంది మృతి
ఇండోనేషియాలో బద్దలైన మౌంట్ లాకీ-లాకీ అగ్నిపర్వతం; 9 మంది మృతి

volcano:ఇండోనేషియాలో బద్దలైన మౌంట్ లాకీ-లాకీ అగ్నిపర్వతం; 9 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2024
10:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలోని ఫ్లోర్స్‌ దీవిలో ఉన్న మౌంట్ లెవొటోబి లకిలకి అగ్నిపర్వతం విస్ఫోటనానికి గురైంది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. అగ్నిపర్వతం గురువారం నుంచి ప్రతి రోజు సుమారు 2,000 మీటర్ల ఎత్తున మందంపాటి బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విస్ఫోటనాలు డేంజర్‌ జోన్‌ను దాటిపోయాయని పేర్కొన్నారు. అగ్నిపర్వతం చుట్టుపక్కల నివాసాలపై వేడి బూడిద పడటంతో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయని సమాచారం.

వివరాలు 

ఖాళీ అవుతున్న గ్రామాలు

"అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. తీవ్ర మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. గ్రామాలను త్వరగా ఖాళీ చేయించి, అక్కడి నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నాం" అని వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) సెంటర్ ప్రతినిధి హడి విజయ చెప్పారు. ఇండోనేషియాలో వరుసగా అగ్నిపర్వత విస్ఫోటనలు జరుగుతున్నాయని అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలు ప్రాంతాలను డేంజర్‌ జోన్‌లుగా గుర్తించారు. ఈ ఏడాది మేలో హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనానికి గురవడంతో 60 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. ఆ పరిసర ప్రాంతంలోని 7 గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది.