Republic Day 2025: గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో
ఈ వార్తాకథనం ఏంటి
2025 గణతంత్ర దినోత్సవం కోసం ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో హాజరయ్యే అవకాశం ఉందని పలు మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
73 ఏళ్ల మాజీ ఆర్మీ జనరల్ సుబియాంటో 2024 అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ పర్యటనలో ఆయన భారత-ఇండోనేషియా సంబంధాలపై ప్రధానమంత్రి మోదీతో విస్తృత చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
అధికారిక ప్రకటన త్వరలో అందే అవకాశం ఉంది. గతేడాది ప్రబోవో ప్రధాని మోదీతో ఫోన్ కాల్‌లో, ఇరుదేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు.
Details
సంప్రదాయంగా మారిన విదేశీ ప్రముఖులను ఆహ్వానించడం
2023 నవంబర్‌లో బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో, ప్రబోవో ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చలు జరిపారు.
భారత్ గణతంత్ర దినోత్సవానికి 1950 నుండి విదేశీ ప్రముఖులను ఆహ్వానించడం సంప్రదాయం. 1952, 53, 66 సంవత్సరాల్లో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.
2007లో రష్యా అధ్యక్షుడు పుతిన్, 2008లో ఫ్రాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, 2016లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్సోయిస్ హోలన్, 2021లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Details
2021లో బోరిస్ జాన్సన్ పర్యటన రద్దు
2021లో కరోనా కారణంగా బోరిస్ జాన్సన్ పర్యటన రద్దయింది.
2018లో ఆసియాన్ దేశాల నాయకులను గణతంత్ర దినోత్సవానికి ఆహ్వానించగా, 2023లో ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.