గణతంత్ర దినోత్సవం: వార్తలు
27 Jan 2023
ఆస్ట్రేలియాఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులను ఖండించిన భారత్
ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జనవరి 12 నుంచి 23 మధ్య మెల్‌బోర్న్‌లో మూడు హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. భారత్‌పై వ్యతిరేక భావజాలంతో 74వ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ దాడులు చేశారు.
26 Jan 2023
నరేంద్ర మోదీగణతంత్ర వేడుకలు: ప్రత్యేక ఆకర్షణగా ప్రధాని మోదీ తలపాగా- దేశంలో వైవిధ్యానికి ప్రతీక
74వ గణతంత్ర వేడుకల వేళ ప్రధాని మోదీ తలపాగా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. మోదీ ప్రధాని అయినప్పటి నుంచి స్వాతంత్య్ర, రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఆయన వస్త్రాధారణ హైలెట్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా మోదీ ధరించే తలపాగా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.
26 Jan 2023
దిల్లీ74వ గణతంత్ర వేడుకలు: కర్తవ్యపథ్‌లో అంబరాన్నంటిన సంబరాలు
దేశవ్యాప్తంగా 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళితో గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డే వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముతో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ హాజరయ్యారు.
26 Jan 2023
పద్మశ్రీ అవార్డు గ్రహీతలుతెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి.
25 Jan 2023
దిల్లీప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది.
25 Jan 2023
నరేంద్ర మోదీఈజిప్టు అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ, కీలక అంశాలపై చర్చలు
జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సీసీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు రోజుల భారత్ పర్యటనలో భాగంగా బుధవారం భారత్ చేరుకున్న అబ్దెల్ ఫతాహ్.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చించారు.
25 Jan 2023
తెలంగాణరాజ్భవన్లోనే గవర్నర్ రిపబ్లిక్ డే వేడుకలు, రాష్ట్ర ప్రభుత్వం లేఖపై తమిళసై అసహనం
కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తాజాగా రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
25 Jan 2023
లైఫ్-స్టైల్రిపబ్లిక్ డే: మీ ఇంటి అలంకరణలో మూడు రంగులను ఇలా ఉపయోగించండి
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాలకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 1950 జనవరి 26వ తేదీ నుండి రాజ్యాంగం అమల్లోకి రావడంతో, ఆ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
25 Jan 2023
ఛత్తీస్గఢ్ఛత్తీస్గఢ్: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
ఛత్తీస్‌గఢ్‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు.
20 Jan 2023
దిల్లీరిపబ్లిక్ డే వేళ.. దిల్లీలో ఖలిస్తానీ అనుకూల పోస్టర్ల కలకలం
దిల్లీలో ఖలిస్థానీ పోస్టర్లు కలకలం సృష్టించాయి. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు జరగనున్న నేపథ్యంలో దిల్లీలో పలు ప్రాంతాల్లో ఖలిస్థానీ అనుకూల పోస్టర్లు వెలిశాయి. పశ్చిమ ఢిల్లీలోని వికాస్పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరాగర్హి తదితర ప్రాంతాల్లో ఈ పోస్టర్లు కనిపించాయి.