
Republic Day 2025: రిపబ్లిక్ డే 2025 పరేడ్ టిక్కెట్ ఎలా బుక్ చేసుకోవాలి - ధరల పూర్తి వివరాలు ఇలా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. దేశం వ్యాప్తంగా ప్రజలు ఈ రోజు ఉత్సాహంగా జరుపుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో, భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం, పోలీసు, పారామిలిటరీ బృందాలతో కూడిన వైభవమైన రెజిమెంటల్ కవాతు ఏర్పాటు అవుతోంది. ఈ కవాతులో ప్రతి రాష్ట్రం తన సాంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రదర్శిస్తుంది. ఈ అద్భుతమైన గ్రాండ్ రిపబ్లిక్ డే పరేడ్‌ను చూడాలనుకునే వారికి మంత్రిత్వ శాఖ టిక్కెట్ ధరలను ప్రకటించింది.
వివరాలు
రిపబ్లిక్ డే ఈవెంట్‌ల టిక్కెట్ ధరలు
ఈవెంట్స్ కోసం మంత్రిత్వ శాఖ సాధారణ ప్రజలకు అనుకూలమైన ధరలను నిర్ణయించింది: రిపబ్లిక్ డే పరేడ్: టికెట్ ధర ₹100, ₹20 బీటింగ్ రిట్రీట్ ఫుల్ డ్రెస్ రిహార్సల్: ఒక్కో టికెట్ ₹20 బీటింగ్ రిట్రీట్ వేడుక: టికెట్ ధర ₹100
వివరాలు
ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్: తేదీలు, ప్రక్రియ
ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విండో జనవరి 2 నుండి జనవరి 11 వరకు అందుబాటులో ఉంది. ఇది మీ సీట్లు బుక్ చేసుకోవడానికి సరిపడే సమయాన్ని కల్పిస్తుంది. టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ఎలా బుక్ చేయాలి.. అధికారిక పోర్టల్ https://aamantran.mod.gov.in/login ను సందర్శించండి. మీరు హాజరయ్యే ఈవెంట్‌ను ఎంచుకోండి, ఉదాహరణకి రిపబ్లిక్ డే పరేడ్ లేదా బీటింగ్ రిట్రీట్. ధృవీకరణ కోసం మీ ఐడీ, మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి. టిక్కెట్ల సంఖ్య ఆధారంగా చెల్లింపును పూర్తి చేయండి. మొబైల్ యాప్ ద్వారా బుకింగ్ అదనపు సౌలభ్యంగా, మంత్రిత్వ శాఖ "ఆమంత్రన్ మొబైల్ యాప్"ను ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్ (Google Play),ఐఓఎస్ (App Store) యూజర్లకు అందుబాటులో ఉంటుంది.
వివరాలు
ఆఫ్‌లైన్ టిక్కెట్ బుకింగ్ వివరాలు
ఈ యాప్ ద్వారా మీరు ఎక్కడి నుంచైనా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి టిక్కెట్లు బుక్ చేయవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసి, టిక్కెట్ కేటగిరీలో సూచనలను అనుసరించి బుక్ చేయవచ్చు. మీరు వ్యక్తిగతంగా టిక్కెట్లు కొనుగోలు చేయాలనుకుంటే, ఢిల్లీలోని వివిధ ప్రదేశాల్లో అధికారిక కౌంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ బూత్‌ల నుండి మీరు టిక్కెట్లు కొనుగోలు చేయడానికి, చెల్లుబాటు అయ్యే ఫొటో ఐడీ తీసుకువెళ్లడం మర్చిపోకండి.