ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్‌ను ప్రకటించిన కేంద్రం, ఏపీకి విశిష్ట సేవా పురస్కారాలు
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రపతి పోలీసు మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 15 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులను గెలుచుకుంది. తెలంగాణకు రెండు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ విశిష్ట సేవా అవార్డులు, 13 మెరిటోరియస్ సర్వీస్ అవార్డులు వరించాయి. జనవరి 26న దేశ రాజధాని దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శకటం ఎంపికైంది. పలు రాష్ట్రాలు పోటీ పడగా, ఆంధ్రప్రదేశ్ శకటం ప్రబల తీర్థం కవాతుకు ఎంపిక చేశారు.
దిల్లీలో పరేడ్ కోసం మొత్తం 17 శకటాలను ఎంపిక
గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో దిల్లీలో పరేడ్ కోసం మొత్తం 17 శకటాలను ఎంపిక చేశారు. అందులో కోనసీమలో ప్రబలతీర్థానికి చోటు దక్కింది. సంక్రాంతి ఉత్సవాన్ని ఇతివృత్తంగా రూపొందించిన ప్రబలతీర్థానికి ఈ అవకాశం దక్కింది. జనవరి 26న దేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతంది. దిల్లీలోని ఎర్రకోటపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం అయన ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు. గణతంత్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వేడుకల పూర్తయ్యే వరకు ట్రాఫిక్ ఆంక్షలను విధించింది.