Page Loader
ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది
రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది పాల్గొనబోతున్నట్లు ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడి

ఛత్తీస్‌గఢ్‌: చరిత్రలో తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో 'థర్డ్ జెండర్' సిబ్బంది

వ్రాసిన వారు Stalin
Jan 25, 2023
03:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌‌లో జనవరి 26న నిర్వహంచే రిపబ్లిక్ డే పరేడ్‌‌లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. రిపబ్లిక్ డే పరేడ్‌‌ చరిత్రలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌లో పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని బస్తర్ ఐజీపీ పి.సుందర్‌రాజ్ వెల్లడించారు. 'బస్తర్ ఫైటర్స్' టీమ్‌ తరఫున ట్రాన్స్‌జెండర్ సిబ్బంది పరేడ్‌‌‌లో పాల్గొబోతున్నట్లు సుందర్‌రాజ్ పేర్కొన్నారు. 'బస్తర్ ఫైటర్స్' అనేది బస్తర్‌లోని మావోయిస్టు ప్రభావిత విభాగాలలో మోహరించిన ఛత్తీస్‌గఢ్ పోలీసు శాఖకు చెందిన ప్రత్యేక విభాగం. థర్డ్ జెండర్‌ సిబ్బంది పరేడ్‌లో పాల్గొనడం వల్ల సమాజానికి మంచి సందేశాన్ని పంపించినట్లు అవుతుందని ఐజీపీ పి.సుందర్‌రాజ్ పేర్కొన్నారు. వీరు అందిస్తున్న సేవల వల్ల బస్తర్‌లోని ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పరేడ్‌‌‌లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ కూడా పాల్గొంటారు.

ఛత్తీస్‌గఢ్‌‌

2022లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్ల నియామకం

ఛత్తీస్‌గఢ్‌‌ పోలీసు విభాగం 2022లో 'బస్తర్ ఫైటర్స్' కోసం నియామకాలను చేపట్టింది. అందులో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లను నియమించుకుంది. కాంకేర్ జిల్లా నుంచి ఎనిమిది మంది, బస్తర్‌కు చెందిన ఒకరు రిక్రూట్‌ అయ్యారు. ఉద్యోగానికి ఎంపికైన 608 మంది అభ్యర్థుల్లో తొమ్మిది మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. జనవరి 26న దేశం 74వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతంది. దిల్లీలోని ఎర్రకోటపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది. 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం అయన ఇప్పటికే భారత్‌కు చేరుకున్నారు.