'రిపబ్లిక్ డే' ఈవెంట్‌లో 50 విమానాలు ఫ్లైపాస్ట్: ఐఏఎఫ్
జనవరి 26 రిపబ్లిక్ డే రోజున 50 విమానాలతో 'ఫ్లైపాస్ట్'ను నిర్వహించనున్నారు. రాజ్‌పథ్ మీదుగా ఈ ఫ్లైపాస్ట్ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 45 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, నేవీకి చెందిన ఒకటి, ఆర్మీకి చెందిన నాలుగు హెలికాప్టర్లు 'ఫ్లైపాస్ట్'లో పాల్గొననున్నాయి. 42 ఏళ్లపాటు భారత నావికాదళానికి సేవలందించిన సముద్ర నిఘా విమానం ఐఎల్-38ని చివరిసారిగా ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు సీనియర్ ఐఏఎఫ్ అధికారి తెలిపారు. బుధవారం జరిగిన మీడియా కార్యక్రమంలో జనవరి 26న జరిగే ఫ్లైపాస్ట్ నమూనాను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆవిష్కరించింది.
జనవరి 26న 'ఫ్లైపాస్ట్'లో పాల్గొనే విమానాలు వివరాలు
ఎంఐ-17 విమానాల సంఖ్య: 4 ఏఎల్‌హెచ్ విమానాల సంఖ్య: 4 మిగ్-29 విమానాల సంఖ్య: 3 ఎల్‌సీహెచ్+ అపాచీ+ ఏఎల్‌హెచ్ ఎంకే-4 విమానాల సంఖ్య: 5 ఏఎల్‌హెచ్ సారంగ్ విమానాల సంఖ్య: 5 డకోటా + డూ-228 విమానాల సంఖ్య: 3 సీ-130 + రఫెల్ విమానాల సంఖ్య: 5 ఐఎల్-38 ఎస్డీ+ఏఎన్-32 విమానాల సంఖ్య: 3 ఏఈడబ్ల్యూ&సీ+ రఫెల్ విమానాల సంఖ్య: 5 సీ-17 + ఎస్‌యూ-30 ఎంకేఐ విమానాల సంఖ్య: 3 జాగ్వార్ విమానాల సంఖ్య: 6 ఎస్‌యూ-30 ఎంకేఐ విమానాల సంఖ్య: 3 రఫెల్ విమానాల సంఖ్య: 1