
Republic Day: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అమెరికా అభినందనలు
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా, భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసింది.
ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తమ పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో ఒక ప్రకటన విడుదల చేశారు.
అమెరికా తరఫున భారతదేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిగా భారత రాజ్యాంగం గుర్తింపు పొందడాన్ని తాము గర్వంగా భావిస్తున్నామని రుబియా పేర్కొన్నారు.
Details
ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం
ఇరు దేశాల భాగస్వామ్యం కొత్త ఎత్తులకు చేరాలని ఆశిస్తున్నామన్నారు.
భారత్-అమెరికా ప్రజల మధ్య స్నేహం, సహకారం మన ఆర్థిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని విశ్వసిస్తున్నామని ఆయన వెల్లడించారు.
అంతరిక్ష పరిశోధనలు సహా రానున్న సంవత్సరాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని రుబియో వ్యాఖ్యనించారు.