Republic Day 2025: జనవరి 26న గణతంత్ర దినోత్సవం.. దేశాభివృద్ధి కోసం మనం ఏం చేయాలి?
ఈ వార్తాకథనం ఏంటి
గణతంత్ర దినోత్సవం కేవలం వేడుకల రోజే కాకుండా, మన రాజ్యాంగంలో ఉన్న విలువలను మనందరికీ గుర్తుచేసే రోజు.
భారతదేశం రాజ్యాంగాన్ని స్వీకరించి, ప్రజాస్వామ్యంతో ఆధారపడిన దేశంగా రూపుదిద్దుకుంది.
ప్రతి పౌరుడు ప్రాథమిక హక్కులందుకోడం ద్వారా సాధికారతను పొందుతున్న రోజు గణతంత్ర దినోత్సవం.
ఇది మనందరికీ గౌరవప్రదమైనది. మన స్వాతంత్ర్య సమరయోధుల పోరాటం, దేశం కోసం చేసిన వారి త్యాగం ఈ రోజు మనం స్మరించాల్సినది.
వారు ఇచ్చిన మన రాజ్యాంగంలో ఉన్న విలువలను జ్ఞాపకంగా ఉంచుకోవడం మన బాధ్యత.
Details
యువత బాధ్యతలను గుర్తించుకోవాలి
శాంతి, సమానత్వం, న్యాయం వంటి మూల విలువలతో భారత్ అభివృద్ధి చెందుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవం భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య విలువలను ప్రదర్శించే వేడుక.
మన రాజ్యాంగం ద్వారా భారతదేశం ప్రతి పౌరుడి స్వరాన్ని, అభిప్రాయాన్ని నిజంగా గౌరవించిన దేశంగా అవతరించింది.
భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు శాంతియుతంగా కలిసి నివసించే సమాజంగా భారతదేశం నిలిచింది.
ఈ రోజున మనం గణతంత్రం ద్వారా ఐక్యత, సంపన్నత సాధించడంలో దేశాన్ని ముందుకు నడిపించే సంకల్పంతో ఉన్నాం.
మన హక్కుల కోసం పోరాడిన వీరుల వారసత్వాన్ని గౌరవించుకుంటూ, యువత తమ బాధ్యతను గుర్తించాలని ఈ రోజు మనం ప్రతిజ్ఞ చేద్దాం.
Details
దేశ పురోగతికి కృషి చేయాలి
ఈ దేశం భవిష్యత్ నాయకులుగా, యువ పౌరులుగా మన దేశం పురోగతికి కృషి చేద్దామని మనం ఆచరించాలి. గణతంత్ర దినోత్సవం గతాన్ని గుర్తించడం మాత్రమే కాదు.
భవిష్యత్తును కూడా ఊహించడం. భారతదేశం సాధించిన అద్భుత పురోగతి, అభివృద్ధి, శాంతి, సుస్థిరత.. ఇవన్నీ మన అందరి కృషి ఫలితమే.
అయితే మనమంతా దేశం అభివృద్ధికి సహకరిస్తామని, దానికి అనుగుణంగా మనం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.