Page Loader
Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా 
Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా

Joe Biden: 'రిపబ్లిక్ డే'కు బైడెన్ భారత్‌కు రావడం లేదు.. క్వాడ్ మీటింగ్ కూడా వాయిదా 

వ్రాసిన వారు Stalin
Dec 12, 2023
06:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

2024, జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌‌ను ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ క్రమంలో రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా బైడెన్ వస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన రిపబ్లిక్ డే వేడుకలకు భారత్‌కు వచ్చే అవకాశం లేదని ఈ విషయం తెలిసిన వారు మంగళవారం తెలిపారు. బైడెన్ రాకపోవడం వల్ల జనవరిలో భారత్‌లో జరగాల్సిన క్వాడ్ సమ్మిట్ కూడా వాయిదా పడింది. క్వాడ్ సమ్మిట్ రీ షెడ్యూల్‌పై భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకుకోలేదు.

బైడెన్

జనవరి 27న సమావేశం నిర్వహించే అవకాశం

ఈ ఏడాది దిల్లీలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్ -అమెరికా ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ప్రధాని మోదీ జనవరి 26, 2024న భారత్‌లో పర్యటించాల్సిందిగా బిడెన్‌ను ఆహ్వానించారు. అదే సమయంలో సమయంలో క్వాడ్ సమ్మిట్ కూడా జరగనుంది. ఈ క్రమంలో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడానికి బైడెన్‌ను ఆహ్వానించారు. క్వాడ్‌ గ్రూప్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ సభ్య దేశాలుగా ఉన్నాయి. అమెరికా లేకుండా సమ్మీట్ జరగడం కుదరదు కాబట్టి.. ఇతర దేశాలు సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. అందుకే జనవరి 27న క్వాడ్ శిఖరాగ్ర సమావేశాన్నినిర్వహించే అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది.