Draupadi Murmu: జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. దిల్లీలో వైభవంగా గణతంత్ర వేడుకలు
ఈ వార్తాకథనం ఏంటి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా, దిల్లీలోని కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆమె సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ వేడుకలో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సారి త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ప్రత్యేకతగా నిలిచింది.
వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Details
9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు
ఈ ఏడాది 'స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్' అనే ఇతివృత్తంతో శకటాలను రూపకల్పన చేశారు. బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణులు, పినాక మల్టీబ్యారెల్ రాకెట్ వీటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కర్తవ్యపథ్‌పై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు.
ఈ పరేడ్‌లో 31 శకటాలను రాష్ట్రాలు, యూటీలు, కేంద్ర శాఖలు ప్రదర్శించాయి.