Page Loader
Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!
రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!

Etikoppaka Toys : రిపబ్లిక్ డే పరేడ్‌లో ఏపీ శకటానికి ప్రతిష్టాత్మక మూడో స్థానం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిపబ్లిక్‌డే వేడుకల్లో భాగంగా దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ శకటం మూడో స్థానం సాధించింది. ఏటికొప్పాక బొమ్మలు ప్రధాన అంశంగా రూపొందించిన ఈ శకటం పరేడ్‌ను వీక్షించిన అతిథులు, ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. పరేడ్‌లో శకటాల ప్రదర్శన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తమ శకటాలను ప్రదర్శించగా, ఉత్తరప్రదేశ్‌ శకటానికి మొదటి స్థానం, త్రిపుర శకటానికి రెండో స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్‌ శకటం మూడో స్థానాన్ని పొందిందని రక్షణ మంత్రిత్వశాఖ అధికారికంగా ప్రకటించింది.

Details

ఉత్తమ ప్రదర్శనలివే

కేంద్ర ప్రభుత్వ శాఖల విభాగంలో గిరిజన శాఖ శకటం ఉత్తమ శకటంగా ఎంపికైంది. ఇక త్రివిధ దళాల్లో, జమ్మూకశ్మీర్‌ రైఫిల్స్‌ కవాతు బృందం ఉత్తమ కవాతుగా నిలిచింది. కేంద్ర బలగాల్లో ఢిల్లీ పోలీస్‌ కవాతు బృందం ఉత్తమ మార్చింగ్‌ కంటింజెంట్‌గా ఎంపికైంది. ఈ ఘనతతో ఏపీ శకటం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.