మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్
2024లో రిపబ్లిక్ డే సందర్భంగా కర్తవ్య్ పథ్‌లో నిర్వహించే పరేడ్‌ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా పరేడ్ ఉండేలా చేసేందుకు అవసమైన ప్రతిపాదలను సిద్ధం చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే కవాతులో జరిగే మార్చ్ పాస్ట్, టేబుల్‌లాక్స్, ప్రదర్శనలలో ఆడవారు మాత్రమే పాల్గొంటారని అధికారులు చెప్పారు. నారీ శక్తికి ఈ చర్య మరొక బూస్టప్‌గా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సైనిక దళాల్లో మహిళలకు ప్రాముఖ్యత
రక్షణ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని హోం అఫైర్స్, కల్చర్, అర్బన్ డెవలప్‌మెంట్‌తో సహా ఇతర మంత్రిత్వ శాఖలకు కూడా తెలియజేసింది. ఇటీవల సంవత్సరాల్లో రక్షణ బలగాలు, సైనిక దళాల్లోని అన్ని పాత్రల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. అందులో భాగంగానే కమాండర్, డిప్యూటీ కమాండర్‌లు అయ్యారు. అలాగే ప్రధాని మోదీ మన్ కీ బాత్ 99వ ఎడిషన్‌లో ప్రసంగిస్తూ, భారతదేశ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో భారతీయ మహిళలు, వారి సాధికారత పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రధాని అన్నారు. ఈ నేపథ్యంలో 74వ గణతంత్ర వేడుకలను నారీశక్తి ఇతి వృత్తంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.