తెలుగింట విరబూసిన పద్మాలు: తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీ నుంచి ఏడుగురికి అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రకటించిన 'పద్మ' అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ నుంచి ఐదుగురికి, ఏపీనుంచి ఏడుగురికి అవార్టులు వచ్చాయి. చిన జీయర్ స్వామి- పద్మ భూషణ్(తెలంగాణ): 1956లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిలో స్వామిజీ జన్మించారు. 1980లో సన్యాసి దీక్షను స్వీకరించారు. కమలేష్ డి పటేల్-పద్మ భూషణ్(తెలంగాణ): హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్‌గైడ్‌గా కమలేష్ డి పటేల్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు ఉంది. 1956లో గుజరాత్‌లో ఈయన జన్మించారు. రామకృష్ణారెడ్డి(తెలంగాణ): గిరిజన భాషల గుర్తింపు కోసం కృషి చేస్తున్న బి.రామకృష్ణారెడ్డిని ప్రద్మశ్రీ వరించింది. విజయ్ గుప్తా(తెలంగాణ): నీలి విప్లవంలో కీలక పాత్ర పోషించిన విజయ్‌గుప్తాకు ప్రద్మశ్రీ వచ్చింది. . పసుపులేటి హన్మంతరావు(తెలంగాణ): పిల్లల వైద్యునిగా విశేష కృషి చేసిన హనుమంతరావుకి ప్రద్మశ్రీ వచ్చింది.
ఆంధ్రప్రదేశ నుంచి అవార్డులు వరించింది వీరికే..
ఎంఎం కీరవాణి-పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): 'ఆర్ఆర్ఆర్' సినిమాలో 'నాటు నాటు' పాటకు గోల్డెన్‌గ్లోబ్ అవార్డు రావడంతో ఆయనకు ప్రపంచస్థాయిలో గుర్తింపు లంభించింది. ఈ పాట ఆస్కార్‌కు కూడా నామినేట్ కావడం గమనార్హం. అబ్బారెడ్డి నాగేశ్వరరావు- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్):ఆర్కిడ్ జాతికి చెందిన 35రకాల మొక్కలను ఈయన కనుగొన్నారు. సీవీ రాజు- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్):లక్క బొమ్మల తయారీలో ఈయన నిష్ణాతులు. కెఎన్ గణేశ్-పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): ఈయన దేశంలోనే తొలి డీఎన్ఏ సిథసిస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రకాశ్ చంద్రసూద్- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): న్యూక్లియర్ ఫిజిక్స్‌లో విశేష కృషి చేశారు. సచ్చిదానంద శాస్త్రి- పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): ఈయన ప్రముఖ హరికథకుడు. రామాయమ, మహాభారత ఇతిహాసాలను హరికథా రూపంలోకి తెచ్చిన ఘనత ఈయన సొంతం. సంకురాత్రి చంద్రశేఖర్-పద్మశ్రీ(ఆంధ్రప్రదేశ్): సంకురాత్రి ఫౌండేషన్ ఏర్పాటు చేసి విద్యాభివృద్ధి విశేష కృషి చేశారు.