Indonesia: జకార్తాలో 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం; 20 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలోని జకార్తా రాజధానిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏరియల్ సర్వే కోసం డ్రోన్లు తయారు చేసే ఏడంతస్తుల కార్యాలయంలో మంగళవారం మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో, అనేక మంది భవనంలో చిక్కుకున్నారని స్థానిక అధికారులు తెలియజేశారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో 20మంది ప్రాణాలు కోల్పోగా అనేకమంది మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మంటలు సమీపంలోని భవనాల వైపు కూడా వ్యాప్తి చెందడంతో, స్థానిక అధికారులు ప్రజలను భద్రతా కారణాల వల్ల ఇళ్ల నుంచి తప్పించించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వివరాలు
నిల్వచేసిన బ్యాటరీ పేలి..
ప్రాథమికంగా, భవనంలోని మొదటి అంతస్తులోని గోదాంలో నిల్వచేసిన బ్యాటరీ పేలడం వలన మంటలు మొదలయ్యాయి అని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. మంటలు పై అంతస్తుల వరకు వ్యాపించడంతో భవనంలో ఉన్న అనేక మంది చిక్కుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని అధికారులు తెలిపారు. ఘటన స్థలానికి చేరిన అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు.