Page Loader
Indonesia: పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినందుకు చంపేశాడు
పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినందుకు చంపేశాడు

Indonesia: పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగినందుకు చంపేశాడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 04, 2024
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

45 ఏళ్లు వయస్సు వచ్చినా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడిగిన పొరిగింటి వ్యక్తిని ఓ వ్యక్తి హత్య చేశారు. ఈ ఘటన ఉత్తర సుమత్రాలోని దక్షిణ తపనులీ రీజెన్సీలో జూలై 29న జరిగినట్లు ఇండోనేషియా మీడియా పేర్కొంది. మిస్టర్ అస్గిమ్ భార్య అందించిన సమాచారం మేరకు దాడి చేసిన వ్యక్తి పర్లిందుంగన్ సిరెగర్ అని పేర్కొన్నారు. జూలై 29న రాత్రి 8 గంటలకు నిందితుడు కట్టితో తన ఇంటికి వచ్చి ఆస్గిమ్ పై దాడి చేశారన్నారు. అస్గిమ్ వీధులో పరిగెత్తినా, వెంబడించి మరి దారుణంగా కొట్టారన్నారు.

Details

ఆస్పత్రికి తరలించే లోపే మరణించిన అస్గిమ్

చుట్టుపక్కల ప్రజలు గమనించి వెంటనే అస్గిమ్ ను ఆస్పత్రికి తరలించారు. కానీ అతను ఆస్పత్రికి చేరుకొనేలోపే మరణించాడు. ఆ ప్రాంతంలోని నివాసితులు చివరికి కొట్టడం ఆపి, మిస్టర్ అస్గిమ్‌ను ఆసుపత్రికి తరలించారు, కాని అతను చేరుకునేలోపే మరణించాడని ఎకెపి మారియా చెప్పారు. దాడి జరిగిన గంటలోపే పర్లిందుంగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.