LOADING...
IMD Alert: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వడగళ్లు, మెరుపులతో హెచ్చరిక
నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వడగళ్లు, మెరుపులతో హెచ్చరిక

IMD Alert: నేడు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వడగళ్లు, మెరుపులతో హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2026
08:58 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మంచు తుఫాన్ తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా దిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, వడగళ్ల వాన పడుతుందని అంచనా వేసింది. ఈప్రాంతాల్లో గంటకు 30-40కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

Details

40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం

అలాగే వాయువ్య భారతదేశంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన గాలులతో పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. హిమాలయ ప్రాంతంలోని అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. హిమపాతంతో పాటు భారీ వడగళ్ల తుఫాన్ కూడా సంభవించవచ్చని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది.

Details

భారీ సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు

ఉత్తరాఖండ్‌లోని చక్రతా, ఔలి, కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ సహా పలు ప్రాంతాల్లో తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలి ప్రాంతాల్లో మంచు తుఫాన్ కారణంగా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం.

Advertisement