LOADING...
Earthquake : తూర్పు ఇండోనేషియాలో భూకంపం..  రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు
తూర్పు ఇండోనేషియాలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు

Earthquake : తూర్పు ఇండోనేషియాలో భూకంపం..  రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే(యూఎస్‌జీఎస్‌)ప్రకటించింది. అయితే ప్రస్తుతం సునామీ ప్రమాదానికి సంబంధించి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. తూర్పుమలుకు ప్రావిన్స్‌లోని తువాల్ నగరానికి పశ్చిమంగా 177కిలోమీటర్ల దూరంలో,భూమికి 80 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది. సోమవారం ఉదయం ఈ ప్రకంపనలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో కొన్ని భవనాలు నేలమట్టమైనట్లు సమాచారం.అయితే ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం వివరాలు అధికారికంగా తెలియరాలేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండోనేషియాలో 6.9 తీవ్రతతో భూకంపం