Page Loader
Earthquake: ఇండోనేషియా తలాడ్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపం 
Earthquake: ఇండోనేషియా తలాడ్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపం

Earthquake: ఇండోనేషియా తలాడ్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2024
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలోని తలాడ్ దీవుల్లో మంగళవారం రిక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) నివేదించింది. ఈ భూకంపం ద్వారా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.ఈ భూకంపం 80 కి.మీ లోతులో సంభవించిందని ఎన్‌సీఎస్ పేర్కొంది. గత వారం,న్యూ ఇయర్ రోజున జపాన్‌లో రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో భారీ ప్రాణ,ఆస్తి నష్టం జరిగింది. గత ఎనిమిదేళ్లలో జపాన్‌లో సంభవించిన ఘోరమైన భూకంపంలో ఇది ఒకటి. ఈ భూకంపం వల్ల కనీసం 100 మంది మరణించారు, 200 మందికి పైగా ప్రజల ఆచూకి ఇంకా తెలియరాలేదు. హోకురికు ప్రాంతంలో 23,000 గృహాలకు ఇప్పటికీ విద్యుత్ లేదు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తలాడ్ దీవుల్లో 6.7 తీవ్రతతో భూకంపం