NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి
    తదుపరి వార్తా కథనం
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి
    ప్రమాదవశాత్తు సముద్రంలో పడి డాక్టర్ కపుల్ మృతి

    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 12, 2023
    10:21 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పెళ్లై పట్టుమని 10 రోజులైనా కాలేదు, అప్పుడే ఈ నవ డాక్టర్ దంపతుల విషయంలో విధి కన్నెర చేసింది. కళ్ల ముందే ప్రజలకు సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యంగ్ కపుల్ పై యమపాశాలను ప్రయోగించింది.

    తమిళనాడుకు చెందిన డాక్టర్ దంపతులు జాలీగా గడిపేందుకు ఇండోనేషియా టూర్ కి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు సముద్రంలో పడిన ఈ వైద్యజంట ప్రాణాలు కోల్పోవడం స్వరాష్ట్రంలో కలకలం సృష్టించింది.

    ఈ నెల 1న వైద్యురాలు విభూషిణియాకు, వైద్యుడు లోకేశ్వరన్‌తో పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు.

    నవ వరుడు లోకేశ్వరన్ ది చెన్నె కాగా నవవధువు తిరువళ్లూరు జిల్లా పూనమల్లి సమీపంలోని సెన్సీర్‌ కుప్పానికి చెందినవారిగా గుర్తించారు.

    Details

    బోట్ బోల్తాపడి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ కపుల్ 

    కొత్తగా పెళ్లైన నేపథ్యంలో డాక్టర్ కపుల్ ఇండోనేషియాలోని బాలి దీవికి హనీమాన్ నిమిత్తం వెళ్లింది. అయితే ఈ నెల 9న ఆ దేశపు సముద్రంలో బోటు షికారుకెళ్లారు దంపతులు.

    బోటింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు పడవ బోల్తాపడటంతో భార్యభర్తలిద్దరూ సముద్రంలో పడి మరణించారు. ప్రమాదం అనంతరం లోకేశ్వరన్ మృతదేహం లభ్యమైంది. నవవధువు విభూషిణియా మృతదేహం మాత్రం శనివారం గుర్తించినట్లు తెలుస్తోంది.

    ఈ నేపథ్యంలో మృతదేహాలను చెన్నైలోని వరుడి ఇంటికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. మరోవైపు హనీమాన్ కోసం వెళ్లిన వైద్య జంట, ఇలా విగతజీవులుగా మారడం పట్ల వారి బంధువులు, కాలనీ వాసులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు
    ఇండోనేషియా

    తాజా

    Surya : హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన సూర్య 46.. త్రివిక్రమ్, జీవీ ప్రకాష్ హాజరు సూర్య
    Techie Suicide: 'అతను ముగ్గురు వ్యక్తుల పని చేసాడు'.. పని ఒత్తిడితో బెంగళూరులో టెక్కీ ఆత్మహత్య.. ఓలా
    Yusuf Pathan : కేంద్రాన్ని త‌ప్పుప‌ట్టిన తృణ‌మూల్ కాంగ్రెస్‌.. దౌత్య బృందం నుంచి తప్పుకున్న యూసుఫ్ ప‌ఠాన్  తృణమూల్ కాంగ్రెస్‌
    Systematic Investment Plan: తక్కువ జీతం.. పెద్ద సంపద? SIP పెట్టుబడితో సాధ్యమే! జీవనశైలి

    తమిళనాడు

    ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది అయ్యప్ప భక్తులు మృతి భారతదేశం
    15వందల ఎకరాల్లో.. భారీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పార్క్‌‌ ఏర్పాటుకు 'ఓలా' ప్రణాళిక ఎలక్ట్రిక్ వాహనాలు
    సీఎం వర్సెస్ గవర్నర్: తమిళనాడులో ముదురుతున్న వివాదం.. రాజ్‌భవన్ ముట్టడికి ప్లాన్! గవర్నర్
    తమిళనాడు పేరును మార్చాలన్న ఉద్దేశం నాకు లేదు: గవర్నర్ రవి గవర్నర్

    ఇండోనేషియా

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అంతర్జాతీయం
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025