NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు
    తదుపరి వార్తా కథనం
    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు
    ఇండోనేషియాలో 6.0 తీవ్రతతో భూకంపం

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు

    వ్రాసిన వారు Stalin
    Jan 16, 2023
    10:30 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇండోనేషియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం నమోదైంది. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ప్రస్తుతం అయితే ప్రాణ నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం అందలేదని వెల్లడించింది.

    పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం తీరంలో ఈ భూకంపం సంభవించింది. అచే ప్రావిన్స్‌లోని సింగ్‌కిల్ నగరానికి దక్షిణ-ఆగ్నేయంగా 48 కిలోమీటర్ల దూరంలో 48 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వివరించింది.

    ఇండోనేషియా

    సునామి ముప్పు లేదు: జియోలాజికల్ సర్వే

    భారీ తీవ్రతతో భూకంపం సంభవించిన నేపథ్యంలో సునామిపై కూడా యూఎస్ జియోలాజికల్ సర్వే క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం వచ్చిన భకంపం తీవ్రతతో సునామి ముప్పు లేదని స్పష్టం చేసింది.

    'రింగ్ ఆఫ్ ఫైర్' కారణంగా ఇండోనేషియాలో భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లు సర్వసాధారణంగా సంభవిస్తుంటాయి. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొంటాయి.

    నవంబర్ 21న పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో 5.6 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల కనీసం 331 మంది మరణించారు. దాదాపు 600 మంది గాయపడ్డారు. 2018లో సునామీ కారణంగా 4,340 మంది మరణించారు. దీని తర్వాత అత్యంత తీవ్రతతో నమోదైన భూకంపం ఇదే కావడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్
    Nayakan Movie: ఆస్కార్‌ రేసు నుంచి టైమ్‌ మాగజైన్‌ వరకూ.. 'నాయగన్‌' చరిత్రలో అరుదైన మైలురాళ్లు ఇవే! కమల్ హాసన్
    Kamal Haasan: కన్నడ బాషా వివాదం.. కమల్‌హాసన్‌ రాజ్యసభ నామినేషన్‌ వాయిదా కమల్ హాసన్
    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025