Page Loader
ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ
ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి

ఈ శతాబ్దం మనందరిది, పరస్పర సహకారంతోనే వృద్ధి, అభివృద్ధి - ప్రధాని మోదీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Sirish Praharaju
Sep 07, 2023
03:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలోని జకర్తాలో జరిగిన ఆసియాన్​ భారత్, తూర్పు ఆసియా సదస్సు ముగిసింది. ఆసియాన్​ దేశాలు పరస్పరం సహకారించుకోవాలని, దక్షిణాది దేశాల వాణిని మరింత బలంగా వినిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఇండో పసిఫిక్​ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం మరింత కొనసాగాలని మోదీ అన్నారు. ఆసియాన్​ దేశాలు మానవాభివృద్ధికి మరింత కృషి చేయాలన్నారు. వృద్ధికి కేంద్రాలైన ఆసియాన్‌ దేశాలు, ప్రపంచ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఈ మేరకు 21 శతాబ్దాన్ని ఆసియాన్ శతాబ్దంగా అభివర్ణించారు. ఇది మనందరి శతాబ్దమని స్పష్టం చేశారు. ప్రపంచదేశాల్లో అనిశ్చితి నెలకొన్నా, ఆసియాన్​లు మాత్రం పరస్పర సహకారంతో స్థిరమైన పురోగతి సాధిస్తున్నారన్నారు. భారత ఈస్ట్ యాక్ట్ విధానానికి మూల స్తంభంగా ఆసియాన్ ఉందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండినేషియా పర్యటన ఫలవంతం: నరేంద్ర మోదీ

Details 

నాలుగో దశాబ్దంలోకి అడుగుపెట్టిన ఆసియాన్‌-భారత్ భాగస్వామ్యం 

ఆసియాన్‌-భారత్ భాగస్వామ్యం నాలుగో దశాబ్దంలోకి ప్రవేశించిందని సదస్సులో భాగంగా ప్రధాని మోదీ చెప్పారు. సౌత్ ఈస్ట్ దేశాల అసోసియేషన్ (ఆసియాన్​) అత్యంత ప్రభావవంతమైన గ్రూపుల్లో ఒకటిగా పరిగణించవచ్చని మోదీ అన్నారు. ఆసియాన్‌లో భారత్​ సహా అగ్రరాజ్యం అమెరికా, చైనా, జపాన్‌, ఆస్ట్రేలియాలు భాగస్వామ్యమయ్యాయి. 20వ ఆసియాన్‌-భారత్, 18వ తూర్పు ఆసియా సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటించారు. అక్కడి ప్రవాస భారతీయలు విమానాశ్రయంలోనే ఘన స్వాగతం పలికారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా గోపికల వేషధారణలో మోదీకి స్వాగతం అందించారు. ఈ క్రమంలోనే ప్రవాసీలతో మోదీ కాసేపు ముచ్చటించి సదస్సు వేదిక వద్దకు బయల్దేరారు. ఆసియాన్‌-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులను విజయవంతంగా ముగించుకున్న మోదీ, గురువారం మధ్యాహ్నం భారత్ కు పయనమయ్యారు.