ఇండియా-భారత్: పాత పేర్లు మార్చుకుని కొత్త పేర్లు పెట్టుకున్న దేశాలు
రాష్ట్రపతి భవన్ లో జరగనున్న జి20 దేశాల విందు కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడంపై రకరకాల వాదనలు తలెత్తుతున్నాయి. ఇండియా పేరును భారత్ గా మార్చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తమ దేశాల పేర్లను మార్చుకున్న దేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం. శ్రీలంక, మయన్మార్: 1972లో రిపబ్లిక్ గా మారిన సిలోన్ తన పేరును శ్రీలంకగా మార్చుకుంది సింహాళీ భాషలో శ్రీలంక అంటే ప్రకాశంవంతమైన భూమి అని అర్థం. అలాగే బర్మా దేశం 1989లో తన పేరును మయన్మార్ గా అధికారికంగా మార్చుకుంది.
మంచి పేరు కోసం పేరు మార్చుకున్న నెదర్లాండ్స్
ఇరాన్, తుర్కియే: ఇరాన్ పాత పేరు పర్షియా. 1935లో ఇరాన్ గా మార్చారు. కజర్ రాజవంశాన్ని తొలగించి రాజుగా మారిన సైనిక అధికారి రెజా షా ఈ పేరు మార్పును సూచించారు. 2022లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ తన దేశం పేరును టర్కీ నుండి తుర్కియే గా మార్చారు. నెదర్లాండ్స్, థాయిలాండ్: అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు కోసం డచ్ వారు తమ దేశం పేరును హాలాండ్ నుండి నెదర్లాండ్స్ గా మార్చారు. 1939లో సియోమ్ తన దేశం పేరును థాయిలాండ్ గా మార్చుకుంది. చెకియా: 2016లో చెక్ రిపబ్లిక్ పేరును చెకియాగా మార్చారు. వ్యాపారం, క్రీడలు మొదలగు విషయాల్లో దేశం పేరును సులభంగా వాడటానికి వీలుగా ఈ మార్పును తీసుకొచ్చారు.