ఇండోనేషియాలో 5.2, ఫిలిప్పీన్స్‌లో 4.7 తీవ్రతతో భూకంపం
ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం 7.30గంటలకు ఇండోనేషియాలో రిక్టర్ స్కేలుపై 5.2 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ధ్రువీకరించింది. 90.5 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. మాలూకు ప్రావిన్సులోని కేఈ దీవుల పరిధిలో ఉన్న ట్యూల్ నగరంలో భూకంపం ఈ భూకంపం ఏర్పడింది. ఇండోనేషియాలో తరుచూ భూకంపాలు సంభివిస్తూనే ఉన్నాయి. అదే విధంగా ప్రపంచంలో 90శాతం భూకంపాలు ఇండోనేషియాలోనే వస్తున్నాయి.
4.7 గా నమోదైందని యునైటెడ్ స్టేట్ జియోలాజికల్ సర్వే వెల్లడి
ఫిలిప్పీన్ దేశంలోని కూడా గురువారం భూకంపం ఏర్పడింది. ఫిలిప్పీన్స్ దేశంలోని సారంగగని ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 4.7 గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. సోక్స్ సర్జెన్, సారంగగని ప్రాంతాలలో భూకంపం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు గురయ్యారు. ఈ ఘటన వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.