Footballer Dies: గ్రౌండ్ లో పిడుగుపడి ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి ..వైరల్ వీడియో ఇదిగో!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలో ఆదివారం మధ్యాహ్నం ఫుట్‌బాల్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురై ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడు మృతి చెందాడు.
వెస్ట్ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో ఆదివారం ఎఫ్ సీ బాండుంగ్,ఎఫ్ బీఐ సుబాంగ్ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ జరుగుతోంది.
ఇరు జట్ల ఆటగాళ్లు పోటాపోటీగా ఆడుతున్నసమయంలో గ్రౌండ్ లో నడుచుకుంటూ వెళుతున్న ఓ ప్లేయర్ పై పిడుగు పడింది.
దింతో ఆ క్రీడాకారుడు అక్కడిక్కడే నిలువునా కుప్పకూలిపోయాడు.
అవాక్కైన సహచరులు అతడి దగ్గరికి పరుగెత్తుకెళ్లారు.సీపీఆర్ చేసి హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా..పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని ప్రకటించారు.
సుబాంగ్‌కు చెందిన 34 ఏళ్ల బాధితుడు కుప్పకూలిన ఘటన అక్కడి వీడియోలో క్యాప్చర్ అయ్యింది. ఇప్పుడు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Details
U-13 కప్ సందర్భంగా పిడుగుపాటుకు గురైన యువ ఆటగాడు
గత 12 నెలల్లో ఇండోనేషియా ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం ఇది రెండోసారి.
తూర్పు జావాలోని బోజోనెగోరోలో ఒక యువ ఫుట్‌బాల్ ఆటగాడు 2023లో సోరటిన్ U-13 కప్ సందర్భంగా పిడుగుపాటుకు గురయ్యాడు.
కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఆటగాడిని వెంటనే మైదానం నుండి బయటకు తీసుకెళ్లి వైద్య చికిత్స కోసం బోజోనెగోరోలోని ఇబ్ను సినా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అనంతరం సుమారు 20 నిమిషాల తర్వాత ఆ యువకుడు స్పృహలోకి వచ్చాడు.
2023లో, బ్రెజిల్‌లో ఫుట్‌బాల్ ఆడుతున్న 21 ఏళ్ల బ్రెజిలియన్ క్రీడాకారుడు కూడా పిడుగుపాటుకు గురయ్యాడు.
Details
బ్రెజిల్‌లో కూడా ఈ తరహా ఘటనే
21 ఏళ్ల కైయో హెన్రిక్ డి లిమా గొన్‌కాల్వ్స్, దక్షిణాది రాష్ట్రమైన పరానాలో జరిగిన కప్ మ్యాచ్‌లో తన యునియావో జైరెన్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు అతనిపై పిడుగుపడి అతను కుప్పకూలిపోయాడు.
గ్రౌండ్ లోనే కుప్పకూలిన అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు.
అతనితో బాటు గ్రౌండ్ లో ఉన్న మరో ఆరుగురు ఆటగాళ్లు కూడా పిడుగుపాటుకు గురై ఆసుపత్రి పాలయ్యారు
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో ఇదే..
This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV
— Githii (@githii) February 11, 2024