Page Loader
Indonesia: ఇండోనేషియాలోని బద్దలైన లెవోటోబి లకి-లకి పర్వతం.. 6కి.మీ వరకు బూడిద 
ఇండోనేషియాలోని బద్దలైన లెవోటోబి లకి-లకి పర్వతం..6కి.మీవరకు బూడిద

Indonesia: ఇండోనేషియాలోని బద్దలైన లెవోటోబి లకి-లకి పర్వతం.. 6కి.మీ వరకు బూడిద 

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2025
01:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియాలోని లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం మళ్లీ బద్దలైంది. ఈ అగ్నిపర్వత శిఖరం నుంచి సుమారు 1.2 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఆకాశంలోకి ఎగసింది. దాంతో భూమి,ఆకాశం ఒకటే అయినట్టు కనిపించింది. ఫ్లోర్స్ ద్వీపంలో ఉన్న ఈ లకిలకి అగ్నిపర్వతం సోమవారం ఉదయం 9:36 గంటలకు విస్ఫోటనం చెందినట్టు ఇండోనేషియా వోల్కనాలజీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు ఆదివారం అర్థరాత్రి అనంతరం కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైందని తెలిపింది. ఆ సమయంలో శిఖరం నుంచి సుమారు 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద వెలువడినట్టు వెల్లడించింది.

వివరాలు 

8,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద

బూడిద వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో, స్థానిక ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి ఫేస్‌మాస్కులు ధరించాలని అధికారులు సూచించారు. అలాగే, అగ్నిపర్వతాన్ని చుట్టుముట్టిన ఆరు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని హెచ్చరించారు. లకిలకి అగ్నిపర్వతం సుమారు 1,584 మీటర్ల (అంటే సుమారుగా 5,197 అడుగుల) ఎత్తులో ఉంది. ఇది చాలా క్రియాశీలకమైన అగ్నిపర్వతంగా గుర్తించబడింది. ఈ ఏడాది మార్చి 21న కూడా ఇది బద్దలైనప్పటి నుండి అది కొనసాగుతూనే ఉన్న ప్రమాదాన్ని సూచిస్తోంది. అంతేకాక, గత ఏడాది నవంబర్ 7న కూడా ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెంది, దాని శిఖరం నుంచి సుమారు 8,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో ఇదే..