NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Indonesia: నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పేలుడు.. 13 మంది మృతి, 46 మందికి తీవ్ర గాయాలు
    తదుపరి వార్తా కథనం
    Indonesia: నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పేలుడు.. 13 మంది మృతి, 46 మందికి తీవ్ర గాయాలు
    Indonesia: నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పేలుడు

    Indonesia: నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో పేలుడు.. 13 మంది మృతి, 46 మందికి తీవ్ర గాయాలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 25, 2023
    09:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తూర్పు ఇండోనేషియాలోని చైనా యాజమాన్యంలోని నికెల్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో ఆదివారం జరిగిన పేలుడులో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోగా, 46 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    సెంట్రల్ సులవేసి ప్రావిన్స్‌లోని మొరోవాలి ఇండస్ట్రియల్ పార్క్‌లోని పిటి ఇండోనేషియా టింగ్షాన్ స్టెయిన్‌లెస్ స్టీల్ యాజమాన్యంలోని ప్లాంట్‌లో ఆదివారం ఉదయం 5:30 గంటలకు (స్థానిక కాలమానం) ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

    గార్డియన్ నివేదించిన ప్రకారం,కొలిమిలో ప్రస్తుతం మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని, కొలిమి దిగువ భాగంలో పేలిపోయే స్వభావం గల ద్రవాల వద్ద అగ్నికీలలు వ్యాపించాయి.

    ఆ తరువాత సమీపంలోని ఆక్సిజన్ సీలిండర్లు పేలిపోయినట్లు కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.

    Details 

     కొలిమి కూలిపోయి, కర్మాగారం భవనం పక్క గోడలు  ధ్వంసం 

    మరణించిన వారిలో తొమ్మిది మంది ఇండోనేషియా కార్మికులు కాగా నలుగురు చైనా కార్మికులు ఉన్నారు.

    వేడి ఆవిరికి గురికావడం వల్ల మరో 46 మంది గాయపడ్డారని సెంట్రల్‌ సులవేసి పోలీసు విభాగం అధిపతి అగస్‌ నుగ్రోహో తెలిపారు.

    ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కొలిమిలో మరమ్మత్తు పనులు జరుగుతుండగా ఆత్యంత తీవ్రతతో కూడిన పేలుడు సంభవించడంతో ఏకంగా కొలిమి కూలిపోయి, కర్మాగారం భవనం పక్క గోడలు ధ్వంసమయ్యాయని పోలీసు విభాగం అధిపతి వివరించారు.

    అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఇండస్ట్రియల్ పార్కును నడుపుతున్న సంస్థ ఈ విపత్తు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇండోనేషియా

    తాజా

    Maganti Gopinath : జూబ్లీహిల్స్ గోపినాథ్ కన్నుమూత.. నిర్మాతగా ఆయన తీసిన సినిమాలివే! జూబ్లీహిల్స్
    Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ.. ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం తెలంగాణ
    Maganti Gopinath Political Career: మాగంటి గోపినాథ్ రాజకీయ ప్రస్థానం.. మూడు దశాబ్దాల సేవలకు వీడ్కోలు జూబ్లీహిల్స్
    Balakrishna: గాడ్ ఆఫ్ మాస్‌ రీ ఎంట్రీ.. బాలకృష్ణ NBK111 సినిమాకు ముహూర్తం ఫిక్స్! బాలకృష్ణ

    ఇండోనేషియా

    ఇండోనేషియాలో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత నమోదు అంతర్జాతీయం
    కలుషిత మందులపై తక్షణమే చర్యలు తీసుకోండి: డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ
    ఇండోనేషియాలో 7.3 తీవ్రతతో భారీ భూకంపం; సునామీ హెచ్చరికలు  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    హనీమాన్ కి ఇండోనేషియా వెళ్లిన తమిళ వైద్యజంట.. ప్రమాదవశాత్తు సముద్రంలో పడి మృతి తమిళనాడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025