Loading...
Anirudh: అనిరుద్‌ కొడితే బాక్సాఫీసులు పగిలిపోతున్నాయ్
అనిరుద్‌ కొడితే బాక్సాఫీసులు పగిలిపోతున్నాయ్

Anirudh: అనిరుద్‌ కొడితే బాక్సాఫీసులు పగిలిపోతున్నాయ్

వ్రాసిన వారు Balachander Sharma
Oct 31, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు తెలుగు సినిమా సంగీతం అంటే దేవిశ్రీ ప్రసాద్, తమన్ పేర్లే ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. టాలీవుడ్‌లో ఏ క్రేజీ ప్రాజెక్ట్ గురించి చర్చ జరిగినా సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు తెరపైకి వస్తోంది. చిన్న సినిమాల నుంచి భారీ పాన్ ఇండియా చిత్రాల వరకు ఆయన సంగీతం కోసం దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో అనిరుధ్ చూపిస్తున్న ప్రతిభ ఆయనకు డిమాండ్‌ను పెంచుతోంది.

Details

ఫ్లాప్‌తో మొదలైనా.. జెర్సీ, దేవరతో గుర్తింపు

తెలుగులో అనిరుధ్ ప్రయాణం పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి'తో మొదలైంది. ఆ సినిమా ఫలితం నిరాశపరిచినా, అనిరుధ్ సంగీతంపై మాత్రం మంచి చర్చ జరిగింది.

ఆ తర్వాత నాని 'గ్యాంగ్ లీడర్', 'జెర్సీ' చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా 'జెర్సీ'లో ఆయన అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎన్టీఆర్ 'దేవర'తో అనిరుధ్ క్రేజ్ మరో స్థాయికి చేరింది.

'చుట్టమల్లే' పాటతో పాటు సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకుల్లో మంచి స్పందన తెచ్చుకుంది. తమిళంలో 'విక్రమ్', 'లియో', 'జైలర్' వంటి చిత్రాలతో సంపాదించిన గుర్తింపు తెలుగులోనూ ఆయనకు ఉపయోగపడింది.

Details

ఒక్కో సినిమాకు రూ.25 కోట్లు.. ఇదేనా డిమాండ్?

అనిరుధ్ రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక్కో సినిమాకు సుమారు రూ.25 కోట్లు తీసుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది.

భారీ ప్రాజెక్టులకు ఈ మొత్తం రూ.30 కోట్ల వరకు ఉండొచ్చనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే ఇవి అధికారికంగా వెల్లడైన పారితోషిక వివరాలు కావు.

ఏఆర్ రెహమాన్ వంటి సీనియర్ సంగీత దర్శకులతో పోల్చినా, అనిరుధ్ మార్కెట్ విలువ వేగంగా పెరిగిందనే అభిప్రాయం వినిపిస్తోంది. వరుస విజయాలు, అభిమానుల్లో ఉన్న క్రేజ్ ఆయనకు ఈ స్థాయి డిమాండ్ తీసుకొచ్చాయి.

ADVERTISEMENT

Details

వరుసగా స్టార్ హీరోల సినిమాలు

ప్రస్తుతం ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్‌తో పాటు, అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ సినిమా వంటి భారీ చిత్రాలకు అనిరుధ్ పేరు వినిపిస్తోంది.

బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ 'కింగ్' సినిమాతోనూ ఆయన పేరు ముడిపడి ఉంది. తమిళంలోనూ రజనీకాంత్, కమల్ హాసన్‌లతో కూడిన భారీ ప్రాజెక్టులకు సంగీతం అందించే అవకాశాలు చర్చలో ఉన్నాయి.

మరోవైపు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విషయంలో అనిరుధ్‌పై నిర్మాతలు పెట్టుకుంటున్న అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించిన ఈ యువ సంగీత దర్శకుడు.. ఇప్పుడు స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో కీలక ఎంపికగా మారడం విశేషం.

ADVERTISEMENT