Indonesia: ఇండోనేషియాలో 2 రైళ్లు ఢీకొని 3 మృతి.. 28 మందికి గాయాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jan 05, 2024
09:45 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం జావాలో శుక్రవారం రెండు రైళ్లు ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, కనీసం 28 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలకు (1130 GMT) ఈ ప్రమాదం పశ్చిమ జావా ప్రావిన్స్‌లోని సికాలెంగ్కాలో వరి పొలాల సమీపంలో జరిగింది. అనేక రైలు బోగీలు బోల్తా పడ్డాయని ప్రావిన్షియల్ పోలీసు ప్రతినిధి ఇబ్రహీం టాంపో తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి