తదుపరి వార్తా కథనం

Polavaram: పోలవరం కార్యాలయంలో పైళ్లు దగ్ధం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 17, 2024
04:08 pm
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు పరిపాలన కార్యాలయంలో పైళ్లు దగ్ధం కావడం కలకలం రేపుతోంది. ఆడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో కీలక పైళ్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది.
పోలవరం ఎడమ ప్రధాన కాల్వకు సంబంధించిన దస్త్రాలు దగ్ధమయ్యాయి.
రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరంలో వద్దనున్న కార్యాయలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అందులో అవకతవకలు జరగడంతో కొందరు అధికారులు కావాలనే ఈ పనికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Details
విచారణ ప్రారంభించిన డిప్యూటీ కలెక్టర్
భూసేకరణకు సంబంధించి లబ్ధిదారులకు పరిహారం విషయంలో అక్రమాలు బయటికొస్తానే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేదవల్లి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు.
దీనిపై మరింత సమాచారం పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
మీరు పూర్తి చేశారు