
పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లు; క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా క్లారిటీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. 1980 ట్రిబ్యూనల్ అవార్డు ప్రకారం పోలవరం ఎత్తు 45.72 మీటర్లని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రాజెక్ట్‌ను అసలు ఎత్తు 45.7 మీటర్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధం: సీఎం జగన్
శాసనసభలో గురువారం పోలవరంపై జరిగిన చర్చలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌ను అసలు ఎత్తు 45.7 మీటర్లతో నిర్మించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక నిబంధనలు పాటించకపోవడం వల్లే గతంలో వచ్చిన వరదల్లో డయాఫ్రమ్‌వాల్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. పోలవరం వైఎస్‌ఆర్‌కు పర్యాయపదమని, పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని అన్నారు. ప్రాజెక్టు ఎత్తుపై టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారాన్ని అసంబద్ధం, అసత్యమని కొట్టిపారేశారు.