పోలవరంలో నీటి నిల్వ 41.15 మీటర్లకే పరమితం; కేంద్రం కీలక ప్రకటన
పోలవరం ప్రాజెక్టుపై గురువారం కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరంలో నీటి నిల్వ ప్రస్తుతం 41.15 మీటర్లకే పరమితం చేసినట్లు పార్లమెంట్‌లో కేంద్రం పేర్కొంది. వైఎస్సార్సీపీ ఎంపీ వెంకట సత్యవతి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానం చెప్పారు. పోలవరం నీటి నిల్వను 45.72 మీటర్ల ఎత్తుతో, 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించాలని వివిధ రైతు సంఘాల ప్రతినిధులు మంగళవారం దిల్లీలోని కేంద్ర ప్రభుత్వ జలవనరుల శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
పునారావస ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు: కేంద్రం
పోలవరం ప్రాజెక్టు తొలిదశ సహాయం, పునారావసం 2023 ఫిబ్రవరి వరకే పూర్తి కావాల్సి ఉందని మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు. తొలిదశలో 20, 946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునారావసం ప్రక్రియ ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే పూర్తి కావాల్సి ఉందని, కానీ ఇంత వరకు పూర్తి చేయలేదని చెప్పారు. ఇప్పటవరకు కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకు మత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునారావసం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు. మిగతా వారికి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.