హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా
హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో అధునాతన హంగులతో యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు చెందిన వారికి సేవలను ఇక్కడి నుంచి అందిస్తున్నారు. అయితే తాజాగా యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ప్రారంభంపై అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలిక ప్రతినిధి వేదాంత్ పటేల్ స్పందించారు. హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ భారతదేశంలోని టెక్, డిఫెన్స్, ఏరోస్పేస్,ఫార్మాస్యూటికల్ రంగాలలో బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టిన అమెరికా కంపెనీలకు తమ ప్రభుత్వాన్ని దగ్గర చేస్తుందని ప్రకటించారు.
మొదటి పాస్‌పోర్ట్‌ను జారీ చేసిన కాన్సులేట్ సిబ్బంది
నానక్‌రామ్‌గూడ ఆఫీస్ నుంచి పూర్తిస్థాయిలో పనులు జరుగుతున్నాయని, బుధవారం మొదటి పాస్‌పోర్ట్‌ను జారీ చేసినట్లు వేదాంత్ పటేల్ పేర్కొన్నారు. నానక్రామ్‌గూడలో ఆఫీస్ ద్వారా మరింత మంది పౌరులకు సేవ చేయడానికి మేము సంతోషిస్తున్నామని చెప్పారు. ఎక్కువ వీసా ఇంటర్వ్యూలను షెడ్యూల్ చేయడానికి, కాన్సులేట్ సిబ్బందిని విస్తరించడానికి మేము తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చేస్తున్న యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్ ట్వీట్ చేసింది. నెడ్ ప్రైస్ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నందున, అమెరికా విదేశాంగ శాఖ తాత్కాలిక ప్రతినిధిగా భారతీయ అమెరికన్ వేదాంత్ పటేల్ వ్యవహరిస్తారని ఇటీవల అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.