వేసవిలో ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడన్ ఆతిథ్యం; వైట్‌హౌస్ ఏర్పాట్లు
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని వైట్‌హౌస్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. జూన్‌లో మోదీకి ఆతిథ్యం ఇవ్వాలని వైట్‌హౌస్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే తేదీని ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తోంది. ఈ విషయంపై మాట్లాడాడానికి అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి నిరాకరించారు. భారత్-అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతానికి ఈ విందు దోహదపడుతుంది. సెప్టెంబరులో దిల్లీలోని గ్రూప్ ఆఫ్ 20లీడర్స్ సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం వంటి అంశాలపై ఇక్కడ చర్చించనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి హాజరవుతారా ?లేదా? అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
భారత్‌లో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకేనా ఈ విందు?
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఇప్పటికే ఇద్దరు దేశాధినేతలకు ప్రత్యక విందును ఏర్పాటు చేశారు. డిసెంబర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు విందు ఇచ్చారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు ఏప్రిల్ 26న షెడ్యూల్ చేశారు. ఇప్పుడు అమెరికా అధికారిక విందును అందుకోబోతున్న మూడో నేతగా ప్రధాని మోదీ నిలవనున్నారు. అమెరికా, భారతదేశం గత నెలలో క్రిటికల్ ఎమర్జింగ్ టెక్నాలజీ కార్యక్రమాన్ని అప్పటికే ప్రకటించాయి. జనరల్ ఎలక్ట్రిక్, జెట్ ఇంజిన్‌ల ఉమ్మడి ఉత్పత్తితో సహా అధునాతన రక్షణ, కంప్యూటింగ్ సాంకేతికతను అమెరికా, భారత్ పంచుకోనున్నాయి. భారత్‌పై రష్యా ప్రభావాన్ని తగ్గించడం కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.