Page Loader
Fake News:  నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే
'నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు' అని అనలేదు:అస్లే టోజే

Fake News: నోబెల్ బహుమతికి ప్రధాని మోదీ బలమైన పోటీదారు అని చెప్పలేదు: అస్లే టోజే

వ్రాసిన వారు Stalin
Mar 16, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత పర్యటనలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి కమిటీ సభ్యుడు అస్లే టోజే చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతికి అతిపెద్ద పోటీదారు అని అస్లే టోజే మాట్లాడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే దీనిపై అస్లే టోజే క్లారిటీ ఇచ్చారు. నోబెల్ శాంతి బహుమతికి అతిపెద్ద పోటీదారు అని తాను అనలేదని చెప్పారు. ఇది ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. అయితే రష్యా-ఉక్రెయిన్ నేపథ్యంలో 'ఇది యుద్ధ యుగం కాదు' కాదు అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను అస్లే టోజే ప్రశంసించారు.

నోబెల్

విదేశాంగ విధాన నిపుణుడిగా అస్లే టోజే‌కు ప్రపంచ స్థాయి గుర్తింపు

అస్లే టోజే 2018 నుంచి నార్వేజియన్ నోబెల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. విదేశాంగ విధాన నిపుణుడిగా అస్లే టోజే‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2009 నుంచి 2018 వరకు నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో రీసెర్చ్ డైరెక్టర్‌గా ఉన్నారు. నార్వేజియన్ విదేశాంగ విధాన చర్చకు రెగ్యులర్ కంట్రిబ్యూటర్, మినర్వాలోని డాజెన్స్ నేరింగ్స్లివ్‌లో సాధారణ కాలమిస్ట్‌గా కూడా టోజే పని చేశారు. నార్వేజియన్ విదేశాంగ విధానంలో ప్రజాస్వామ్యం, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, చట్ట నియమం, సంప్రదాయవాదం లాంటి అంశాలు అస్లే టోజే‌ ప్రతిపాదించినవే కావడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఫేక్ న్యూస్‌పై క్లారిటీ ఇచ్చిన అస్లే టోజే