Page Loader
'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

'యోగా మహోత్సవ్‌'లో పాల్గొనాలని ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

వ్రాసిన వారు Stalin
Mar 13, 2023
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల 'యోగ మహోత్సవ్'లో ఆనందంగా పాల్గొనాలని పౌరులను ఆహ్వానించారు. ప్రజలు ఇప్పటికే యోగా చేయకపోతే, ఆసనాలను నేర్చుకొని వారి జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మూడు రోజుల "యోగా మహోత్సవ్ - 2023" దిల్లీలో మార్చి 13, 14 తేదీల్లో తల్కటోరా స్టేడియంలో, మార్చి 15న మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగాలో నిర్వహించనున్నారు.

యోగా

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత్ ప్రతిపాదించింది. రికార్డు స్థాయిలో 177 సభ్య దేశాలు భారతదేశం ప్రతిపాదించిన తీర్మాన ముసాయిదాకు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి. భారతదేశ పురాతన సంప్రదాయం ప్రపంచానికి యోగాను బహుమతిగా ఇచ్చిందని ముసాయిదా తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. యోగాను జీవితంలో భాగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్య చైతన్యాన్ని మెరుగుపర్చుకోవాలని పిలుపునిచ్చారు.