NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి
    లైఫ్-స్టైల్

    పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి

    పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి
    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 11, 2023, 10:47 am 0 నిమి చదవండి
    పైల్స్ తో బాధపడుతున్నారా? ఈ యోగాసనాలు పనిచేస్తాయి
    పైల్స్ ఇబ్బంది పెడుతుంటే ఈ యోగాసనాలు చేయండి

    మూలశంఖ లేదా.. మొలలు.. అని పిలవబడే ఈ వ్యాధి తీవ్ర ఇబ్బందిని కలిగిస్తుంది. మలద్వారం వద్ద ఉబ్బడం, మల ద్వారం నుంచి రక్తం రావడం జరుగుతుంటుంది. ఈ పరిస్థితి తీవ్రంగా ఉంటే డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంపల్సరీ. అయితే ఈ సమస్య తీవ్రతను కొన్ని యోగాసనాల ద్వారా కూడా తగ్గించవచ్చు. బాలాసనం ఈ ఆసనం వల్ల పైల్స్ నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. మోకాళ్ళ మీద కూర్చుని ఆ తర్వాత నెమ్మదిగా నడుము భాగాన్ని నేల మీదకు వంచాలి. ఈ సమయంలో రొమ్ము భాగం తొడలను తాకాలి. తల మాత్రం నేలను తాకేలా చూడాలి. ఇప్పుడు రెండు చేతులను తలకు సమాంతరంగా ముందు వైపుకు చాచాలి. లేదా వెనక్కి తిప్పుకొని పాదాలను పట్టుకోవాలి.

    పైల్స్ ఇబ్బందిని తగ్గించే ఇతర యోగాసనాలు

    విపరీత కారణి గోడకు దగ్గరగా వెల్లకిలా పడుకుని కాళ్ళను పైకి లేపాలి, పూర్తిగా కాళ్లు పైకి లేచిన తర్వాత నడుము భాగాన్ని కూడా పైకి లేపి చేతులతో పిరుదులను పట్టుకోవాలి. కొన్ని నిమిషాలు అలాగే ఉండి ఆ తర్వాత రిలాక్స్ అవ్వాలి. పవనముక్తాసనం మలద్వారం దగ్గర ఉబ్బిన ప్రాంతాన్ని తగ్గించడంలో ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెల్లకిలా పడుకుని మోకాళ్ళను వంచి రొమ్ము వైపు తెచ్చుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్ళను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని మీ తలను రెండు కాళ్ల మధ్యకు తీసుకెళ్లాలి. హలాసనం వెల్లకిలా పడుకుని కాళ్ళను గాల్లో పైకి లేపి అలానే కాళ్ళను తల వైపుకు తీసుకువచ్చి నేల మీద ఆనించాలి చేతులను నేల మీదే ఉంచి బ్యాలెన్స్ చేయాలి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    యోగ
    జీవనశైలి

    యోగ

    చేతుల ఆకారాన్ని అందంగా, ఆకర్షణీయంగా  మార్చే యోగాసనాలు  వ్యాయామం
    నడుము చుట్టూ పేరుకున్న కొవ్వును యోగా తగ్గించేస్తుందా? ఈ ఆసనాలు ప్రయత్నించండి  జీవనశైలి
    యోగా ప్రాక్టీసు మొదలు పెట్టే వారు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    మీరు తీవ్రంగా అలసిపోయారా? మనసును, శరీరాన్ని ప్రశాంతంగా మార్చే ఈ యోగాసనాలు ప్రయత్నించండి  లైఫ్-స్టైల్

    జీవనశైలి

    పిడుదు పురుగుల ద్వారా సోకే ప్రాణాంతక పోవాసన్ వైరస్ గురించి తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    పని ఒత్తిడి మరీ ఎక్కువగా ఉందా? ఒత్తిడిని తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులు  వర్క్ ప్లేస్
    మీ మనసు ప్రశాంతంగా, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయించాలి, ఎందుకో ఇక్కడ తెలుసుకోండి  లైఫ్-స్టైల్
    ఇన్ ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్: ఈ జీర్ణ సంబంధ వ్యాధి లక్షణాలు, చికిత్స తెలుసుకోండి  లైఫ్-స్టైల్

    లైఫ్-స్టైల్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Lifestyle Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023