Page Loader
నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు
నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు

నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను కూల్చేసిన రష్యా ఫైటర్ జెట్లు

వ్రాసిన వారు Stalin
Mar 15, 2023
03:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా నిఘా డ్రోన్ ప్రొపెల్లర్‌ను నల్ల సముద్రంపై రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టింది. దీంతో తమ MQ-9 రీపర్ డ్రోన్‌ నీటిలో కూలిపోయినట్లు అగ్రరాజ్యం తెలిపింది ఉక్రెయిన్-రష్యా యుధం మొదలైన తర్వాత వాషింగ్డన్-మాస్కో మధ్య జరిగిన మొదట జరగిన మొదటి ప్రత్యేక్ష ఘర్షణ ఇదే కావడం గమనార్హం. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష ఘర్షణకు అవకాశం కల్పిస్తుందని ప్రపంచ దేశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌-27 యుద్ధ విమానాలు.. తమ MQ-9 డ్రోన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించాయని అమెరికా తెలిపింది. రష్యా ఫైటర్ జెట్లు చాలా తమ డ్రోన్‌పై ఇంధనాన్ని పోసాయని పెంటగాన్ తెలిపింది. 40 నిమిషాల తర్వాత రెండింటిలోని ఒక ఫైటర్ జెట్‌ డ్రోన్ ప్రొపెల్లర్‌ను ఢీకొట్టిందని పేర్కొంది.

అమెరికా

రష్యా రాయబారిని పిలిపించి నిరసన తెలిపిన అమెరికా

రష్యా అనాలోచిమైన నిర్ణయం వల్ల రెండు విమానాలు కూలిపోయినట్లు అమెరికా తెలిపింది. తమ డ్రోన్‌ను రష్యా స్వాధీనం చేసుకోలేదని పేర్కొంది. అయితే రష్యా తీరు.. ముమ్మాటికి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనని అగ్రరాజ్యం పేర్కొంది. రష్యా చర్యను తప్పుబట్టిన అమెరికా.. ఆ దేశ రాయబారిని పిలిపించి నిరసనను తెలియజేసింది. డ్రోన్ నేరస్థుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వైట్‌హౌస్ జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన రష్యా తమ ఫైటర్ జెట్లు డ్రోన్‌ను ఢీకొట్టడం గానీ, కాల్పులు జరపడం గానీ చేయలేదని చెప్పింది. రష్యాలోకి చొచ్చుకొచ్చినట్లు వెల్లడించింది. అయితే తమ ఫైటర్ జెట్లు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో అది నల్ల సముద్రంలోకి కూలిపోయినట్లు పేర్కొంది.