అమెరికాలో మరో బ్యాంకు మూసివేత; బాధ్యులను వదిలి పెట్టబోమని బైడెన్ ప్రకటన
అమోరికాలో మరో బ్యాంకు మూతపడింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు సంక్షోభాన్ని మరువకముందే సిగ్నేచర్ బ్యాంకును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అమెరికాలో వరుసగా బ్యాంకులు మూతపడుతున్న నేపథ్యంలో అధ్యక్షుడు బైడెన్ కీలక ప్రసంగం చేశారు. బ్యాంకు వైఫల్యానికి కారణమైన వారిని జవాబుదారులుగా ఉంచుతామని బైడెన్ ప్రకటించారు. డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయని అమెరికన్లకు బైడెన్ భరోసా ఇచ్చారు. పెద్ద బ్యాంకుల పర్యవేక్షణ, నియంత్రణను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తామని బైడెన్ పేర్కొన్నారు.
బ్యాంకులకు అదనపు నిధులను అందుబాటులో ఉంచుతాం: ఫెడ్
అమెరికన్ ప్రజలు వ్యాపారాలకు అవసరమైనప్పుడు తమ బ్యాంకు డిపాజిట్లు తీసుకొవచ్చనే విశ్వాసాన్ని బైడెన్ కలిగించారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ వైఫల్యాల తర్వాత అమెరికన్లకు భరోసా ఇవ్వడానికి సోమవారం జాతినుద్దేశించి బైడెన్ ప్రసగించనున్నారు. అమెరికా ట్రెజరీతో సహా ఫైనాన్షియల్ ఏజెన్సీలు, ఎస్‌వీబీ డిపాజిటర్లు మార్చి 13 నుంచి వారి సొమ్మును తీసుకునేందకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. డిపాజిటర్ల అవసరాలను తీర్చేందుకు బ్యాంకులకు అదనపు నిధులను అందుబాటులో ఉంచుతామని ఫెడ్ ప్రకటించింది.