ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుపడ్డ రష్యా- ఆరుగురు పౌరులు మృతి
ప్రజలు నిద్రిస్తున్న సమయంలో గురువారం రాత్రి ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. క్షిపణుల ధాటికి కీవ్ సహా ఇతర ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రష్యా దాడుల్లో ఆరుగురు పౌరులు మృతి చెందారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పూర్తిగా దెబ్బతీశారు. గ్రిడ్ నుంచి అణు విద్యుత్ ప్లాంట్‌ను బలవంతంగా తొలగించారు. రష్యా క్షిపణుల దాడి కారణంగా 10 ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు దెబ్బతిన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు.
ప్రతి దానికి బాధ్యత వహించకుండా తప్పించుకోలేరు: ఉక్రెయిన్
ఆక్రమణదారులు పౌరులను మాత్రమే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారికి చేతనయ్యింది అది ఒక్కటేనని జెలెన్‌స్కీ మండిపడ్డారు. వారు చేసిన ప్రతిదానికీ భవిష్యత్‌లో బాధ్యత వహించకుండా తప్పించుకోలేరని హెచ్చరించారు. పశ్చిమ ఎల్వివ్ ప్రాంతంలోని ఒక గ్రామ గృహాన్ని రష్యా సేనలు ధ్వంసం చేయగా, కనీసం ఐదుగురు వ్యక్తులు మరణించారు. సెంట్రల్ డ్నిప్రో ప్రాంతంలో క్షిపణుల దాడిలో మరో పౌరుడు మరణించినట్లు సమాచారం. రాజధాని కైవ్‌లో పేలుళ్ల ధాటికి స్థానికులు ఉలిక్కిపడ్డారు. దాదాపు రాత్రి పూట ఏడు గంటలపాటు క్షిపణులను రష్యా సేనలు ప్రయోగించాయి.