Page Loader
భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా
భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా

భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం చేయనున్న రష్యా

వ్రాసిన వారు Stalin
Mar 07, 2023
05:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం-రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎంత దృఢమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం కోసం వీసా విధానాన్ని సడలించి, సరళీకృతం చేయబోతున్నట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా వెళ్లాలలనుకునే భారతీయులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ భారత్‌లో పర్యటించిన తర్వాత వీసా మార్గదర్శకాలను సడలించే ప్రక్రియపై దృష్టి సారించింది. వీసా విధానాలను సడలించే ప్రక్రియను రష్యా ఇప్పటికే ప్రారంభించింది. భారత్‌తో పాటు అంగోలా, వియత్నాం, ఇండోనేషియా, సిరియా ఫిలిప్పీన్స్‌ దేశాల వీసా ప్రక్రియను కూడా సడలించే ఆలోచనలో రష్యా ఉంది.

రష్యా

11దేశాలకు వీసా రహితంగా వెళ్లేందుకు రష్యా ప్రణాళికలు

వీసా రహిత ప్రయాణానికి సంబంధించి ఇంటర్‌గవర్నమెంటల్ ఒప్పందాలను సిద్ధం చేసే పనిలో రష్యా ఉన్నట్లు ఉప విదేశాంగ మంత్రి ఎవ్జెనీ ఇవనోవ్ వెల్లడించారు. సౌదీ అరేబియా, బార్బడోస్, హైతీ, జాంబియా, కువైట్, మలేషియా, మెక్సికో, ట్రినిడాడ్ తోపాటు మరో మూడు విదేశీ గమ్యస్థానాలతో ఈ ఒప్పందాలపై సంతకం చేయడానికి రష్యా సన్నద్ధమవుతోంది. ప్రయాణ, పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి రష్యా నిబంధనలను సడలిస్తున్నట్లు తెలుస్తోంది.