Page Loader
సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి
ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి

సిడ్నీ: ఆస్ట్రేలియాలో పోలీసుల కాల్పుల్లో భారతీయుడు మృతి

వ్రాసిన వారు Stalin
Mar 01, 2023
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలో సిడ్నీలో పోలీసుల కాల్పుల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. సిడ్నీ రైల్వే స్టేషన్‌లో క్లీనర్‌ను కత్తితో పొడిచి, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను బెదిరించినందుకు భారతీయుడిని ఆస్ట్రేలియా పోలీసులు కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అతను బ్రిడ్జింగ్ వీసాపై ఆస్ట్రేలియాలో నివసిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ చెప్పింది. పోలీసులు కాల్చి చంపిన వ్యక్తిని తమిళనాడుకు చెందిన మహ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (32)గా సిడ్నీలోని భారత కాన్సులేట్ గుర్తించారు. ఈ సంఘటన చాలా దురదృష్టకరమని భారత కాన్సులేట్ కార్యాలయం పేర్కొంది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్పింది.

ఆస్ట్రేలియా

అహ్మద్ ఛాతిలో రెండు రౌండ్ల బుల్లెట్లు

సిడ్నీలోని ఆబర్న్ స్టేషన్‌లోని క్లీనర్ (28)పై అహ్మద్ దాడికి పాల్పడినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వార్తాపత్రిక తెలిపింది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న ఇద్దరు పోలీసు అధికారులు అహ్మద్‌కు ఎదురు పడగా, వారిపై దాడికి ప్రయత్నించారని రాసుకొచ్చింది. ఈ క్రమంలో ఒక పోలీసు అధికారి అహ్మద్‌పై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అందులో రెండు రౌండ్ల బుల్లెట్లు అహ్మద్ ఛాతీకి తగిలాయి. అనంతరం అహ్మద్‌కు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ సందర్భంగా అహ్మద్ దాడిని పోలీసులు ఉన్నతాధికారులు సమర్థించుకున్నారు. అహ్మద్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.