Page Loader
ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి
ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

ఆన్‌లైన్‌లో సాలార్‌జంగ్ మ్యూజియం; ఇంకెందుకు ఆలస్యం చూసేయండి

వ్రాసిన వారు Stalin
Mar 21, 2023
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియాన్ని సందర్శించాలనుకుంటున్నారా? పని ఒత్తడిలో ఉండటం, హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ వల్ల మ్యూజియంకు వెళ్లేందుకు సమయం కేటాయించకలేకపోతున్నారా? అయితే మీలాంటి వారికోసమే మ్యూజియం నిర్వాహకులు ప్రత్యేక ఆన్‌లైన్ ప్రదర్శనను ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ పురాతన మ్యూజియాల్లో ఇది ఒకటి. అంతేకాదు ప్రపంచంలోనే ప్రపంచంలోని అతిపెద్ద మ్యూజియాల్లో సాలార్‌జంగ్ మ్యూజియం కూడా ఉంది. మ్యూజియంలోని అరుదైన శిల్పాలు, పెయింటింగ్‌లు, శిల్పాలు, వస్త్రాలు, మాన్యుస్క్రిప్ట్‌లు, సిరామిక్స్, కళాఖండాల డిజిటలైజ్డ్ వెర్షన్‌లను ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు.

సాలార్‌జంగ్ మ్యూజియం

వెబ్‌సైట్‌లో రాజుల కాలం నాటి శాసనాలు, కళాఖండాలు

కొన్ని శతాబ్దాల నాటి సేకరణలు, వాటి చరిత్రతో సహా అన్ని వివరాలను https://artsandculture.google.com/partner/salar-jung-museum వెబ్ సైట్లో ఉంచినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆన్‌లైన్ ఎగ్జిబిషన్‌లో 'సింబల్స్ ఆఫ్ గ్లోరీ' అనే పేరుతో రాజుల కాలం నాటి శాసనాలు, పెయింటింగ్‌లు, నవాబుల పోర్ట్రెయిట్‌లతో కూడిన కత్తులు, ఖడ్గాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. 'వండర్స్ ఇన్ వుడ్' పేరుతో చెక్కతో చేసిన ఖళాఖండాలను వెబ్ సైట్లో చేర్చారు. ఇవే కాకుండా అనేక కళాఖండాలు, హైదరాబాద్ చరిత్రకు సంబంధించిన చిత్రాలను వెబ్ సైట్లో నిర్వాహకులు పొందుపర్చారు.