ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీకానున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
ప్రపంచాన్ని ఊపేస్తున్న 'నాటు..' పాటతో తెలుగు ఖ్యాతిని ప్రపంచ వేదికపై నిలబెట్టడమే కాదు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్న RRR సినిమా బృందం ఇటీవలే తిరిగి హైదరాబాద్ వచ్చారు. భారతదేశానికి ఆస్కార్ అవార్డును తెచ్చి పెట్టిన ఆ సినిమా బృందాన్ని అభినందిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు ఆహ్వానం అందింది. అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్ టి ఆర్ కూడా నటించారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ అవార్డు వచ్చిన పాటలో ఎన్ టి ఆర్ కూడా సరిసమానంగా డ్యాన్స్ వేసి మెప్పించారు. కానీ, కేవలం రామ్ చరణ్ కు మాత్రమే ఆహ్వానం అందడం సర్వత్రా చర్చలకు దారి తీసింది.