Page Loader
ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం
హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన

ఇండిగో: హైదరాబాద్‌లో గాల్లో ఉన్న విమానంపై వడగళ్ల వాన; తప్పిన పెను ప్రమాదం

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
07:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వస్తున్న ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో విమానంపై వడగళ్ల వాన పడింది. దీంతో విమానం భారీగా దెబ్బదిన్నది. ముఖ్యంగా విమానం ముందుభాగంలోని రాడోమ్, విండ్‌షీల్డ్‌పై గణనీయమైన ప్రభావం పడింది. పైలెట్ చాక చక్యంతో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్‌బస్ ఫ్లైట్ 6E6594 విమానం ప్రమాదానికి గురైనట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు చెప్పారు.

హైదరాబాద్

వడగళ్ల వాన కారణంగా దెబ్బతిన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం

వడగళ్ల వాన కారణంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణం కూడా దెబ్బతిన్నట్లు అధికారులు చెప్పారు. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల వాన, ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మార్చి నెలలో ఇలాంటి వానలు పడటం చాలా అరుదని వాతావరణ నిపుపులు చెబుతున్నారు. ఒక వైపు విమానాన్ని వడగళ్లు బలంగా తాకుతున్నా, పైలట్లు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంపై అధికారులు వారిని అభినందించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు గానీ, సిబ్బందికి గానీ ఎటువంటి గాయాలు లేవు.