Page Loader
దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు
దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

దిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధాని; రక్షణ, వాణిజ్యంపై మోదీతో కీలక చర్చలు

వ్రాసిన వారు Stalin
Mar 20, 2023
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్ ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిదా రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కిషిదాకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు. జపాన్ ప్రధాని పర్యటన భారత్‌లో దాదాపు 27 గంటలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఆయన ప్రధాని మోదీ భేటీ కానున్నారు. జపాన్ ఇండో-పసిఫిక్ వ్యూహం, రక్షణ అంశాలపై ప్రధాని మోదీతో కిషిదా చర్చించనున్నారు. పదిహేనేళ్ల క్రితం షింజో అబే ప్రధానిగా ఉన్నప్పుడు తొలిసారిగా భారత్‌కు వచ్చినప్పుడు ఇండో-పసిఫిక్ సహకారం అంశంపై ఇరు దేశాధినతల మధ్య కీలక చర్చలు జరిగాయి.

జపాన్

చైనా సవాళ్లను ఎదుర్కొనేందుకు 'ఇండో-పసిఫిక్ శాంతి ప్రణాళిక'

రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, అత్యున్నత సాంకేతికతలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై మోదీ-ఫ్యూమియో కిషిదా మధ్య కీలక జర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం భారత్ జీ20కి సారథ్యం వస్తోంది. జపాన్ జీ7 కూటమికి అధ్యక్షత వహిస్తోంది. ఈ క్రమంలో ఇరువురు దేశాధినతల మధ్య జీ20, జీ7కు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆసియాలో భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న నేపథ్యంలో ఇండో-పసిఫిక్ విషయంలో చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో అనుసంరించాల్సిన వ్యూహంపై మోదీ-కిషిదా చర్చంచనున్నారు. 'ఇండో-పసిఫిక్ శాంతి ప్రణాళిక'ను కూడా ఇరు దేశాధినతలు ఆవిష్కరించే అవకాశం ఉంది