ఈక్వెడార్‌లో 6.8 తీవ్రతతో భూకంపం, 14 మంది మరణం
శనివారం ఈక్వెడార్, ఉత్తర పెరూ తీరప్రాంతాన్ని కుదిపేసిన భారీ భూకంపంలో కనీసం 14 మంది చనిపోయారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం (USGS) 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం గుయాస్ ప్రావిన్స్‌లోని బాలావో నగరానికి 10 కిమీ (6.2 మైళ్లు) దూరంలో 66.4 కిమీ (41.3 మైళ్లు) దగ్గర సంభవించింది. అయితే సునామీ వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. భూకంపం వల్ల సంభవించిన నష్టం ఎంతో ఇంకా చెప్పలేమని. బాధితులకు నా సంఘీభావం తెలియజేస్తున్నానని ఈక్వెడార్ అధ్యక్షుడు గిల్లెర్మో లాస్సో ఒక ట్వీట్‌లో తెలిపారు. భూకంపం కారణంగా ఎల్ ఓరో ప్రావిన్స్‌లో 14 మంది మరణించారని, 380 మందికి పైగా గాయపడ్డారని ప్రెసిడెన్సీ కమ్యూనికేషన్ ఏజెన్సీ తెలిపింది.
శాంటా రోసా విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది
కనీసం 44 ఇళ్లు ధ్వంసమయ్యాయని, మరో 90 దెబ్బతిన్నాయని ఏజెన్సీ తెలిపింది. దాదాపు 50 విద్యా భవనాలు, 30 కంటే ఎక్కువ ఆరోగ్య కేంద్రాలు కూడా తీవ్రంగా , భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి. శాంటా రోసా విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతింది. ప్రభుత్వ ఆయిల్ కంపెనీ పెట్రోఎక్వెడార్ ముందు జాగ్రత్తగా ఖాళీ చేసి, కార్యకలాపాలను ఆపింది. అయితే నష్టం గురించి నివేదించలేదని ఏజెన్సీ తెలిపింది. ఈక్వెడార్ జియోఫిజిక్స్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, భారీ భూకంపం తరువాత గంటలో తక్కువ తీవ్రతలో రెండు ప్రకంపనలు సంభవించాయి. దేశంలోని ఉత్తర ప్రాంతంలో భూకంపం సంభవించిందని, అయితే ప్రజలకు లేదా నిర్మాణాలకు హాని జరిగినట్లు నివేదికలు లేవని పెరూ అధికారులు తెలిపారు.