
తెలంగాణ: సికింద్రాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం; ఆరుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని సికింద్రాబాద్‌లోని నివాస సముదాయంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు, ఇద్దరు అబ్బాయిలు ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగినప్పుడు వారు కాంప్లెక్స్ లోపల ఉన్నారని, వారిని రక్షించే సమయానికే తీవ్ర గాయాలతో ఉన్నారని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా మరణించినట్లు పేర్కొన్నారు.
ఈ ప్రమాదం నుంచి ఏడుగురిని రక్షించినట్లు దీప్తి తెలిపారు.
హైదరాబాద్
షార్ట్ సర్క్యూట్ వల్లే చెలరేగిన మంటలు
కాంప్లెక్స్‌లో గురువారం సాయంత్రం 7.30 గంటలకు మంటలు చెలరేగాయని నార్త్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సయ్యద్ రఫీక్ తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందగానే అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నట్లు డీసీపీ రఫీక్ తెలిపారు.
భవనంలోని 5వ అంతస్థులో దాదాపు 10 మంది వ్యక్తులు చిక్కుకుపోయారని ఓ ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి తెలిపారు.
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఇప్పటి వరకు 11 మందిని రక్షించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.