Maredumilli: మన్యంతో మమేకమయ్యేలా.. మారేడుమిల్లిలో పర్యాటక అభివృద్ధి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 27, 2026
11:58 am
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం జిల్లా మన్యం ప్రాంతం దట్టమైన అడవులు, ఉరకలెత్తే జలపాతాలు, నిండుగా ప్రవహించే గోదావరితో ప్రకృతి అందాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది. ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మారేడుమిల్లి పరిసరాల్లో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో 'వనవిహారి', 'జంగిల్ స్టార్ నేచర్ క్యాంపు'ల్లో పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు సఫారీ కోసం ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేశారు. అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో రిసార్టుల నిర్మాణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడంతో పాటు సౌకర్యవంతమైన వసతి, వినోదాన్ని పర్యాటకులకు అందించాలనే ఉద్దేశంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.