అంబటి రాంబాబు: వార్తలు

టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు

ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు.

మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా కోర్టు షాకిచ్చింది. మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని సత్తెనపల్లి పోలీసులను ఆదేశించింది.